నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్య - neelo intha prema o yesayya

 పల్లవి :నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్య ఆ ..
నాపై ఎంత జాలి ఓ యేసయ్య  || 2 ||
ఎందుకో నన్నింతగా ప్రేమించావు
నేనెలాగు నీ రుణము తీర్చుకోనయ్య

1. పాపినైనా నా కొరకు - పరలోకం విడిచావు ఊ....
నశియించిపోయెనన్ను - వెదకి రక్షించావు
ఏ యోగ్యతా ఆ.. నాలో ఉందని
నీ పోలికలో  ఓ.. నన్ను చేసినందుకా ఆ..    || 2 ||  || నీలో ||

2.దోషి నైన నా కొరకు - నీ ప్రాణం విడిచావు
పరిశుద్ధమైన రక్తం - నా కొరకే కార్చావు
నీ ప్రాణమైన నాకోసం - వదులు కున్నావు
నన్ను వదులుకోలేదు - నా సర్వంమా   || 2 || || నీలో ||

3.వేవేల దూతలతో - కడబూర శబ్దముతో
సీయోను రారాజువై నా కొరకే వస్తావు
నీ దీన జీవితం - నీ మహిమతో నింపి
పరిశుద్ధుల సహవాసముతో చేర్చుకుందువే    || 2 || || నీలో ||

lyrics in english
pallavi:
neelo intha prema o yesayya aa..
naapai entha jaali o yesayya  || 2 ||
endhuko nanninthaga preminchavu
nenelaagu nee runamu theerchukonayya  || neelo ||

1.paapinaina naa koraku - paralokam vidichaavu...
nashiyinchi poye nannu vedhaki rakshinchavu
ey yogyatha naalo undhani
nee polikalo nannu chesinandhukaa aa.. || 2 || || neelo ||

2.dhoshinaina naa koraku - nee pranam vidichavu
parishuddhamaina raktham - naa korakey kaarchavu
nee pranamaina naa kosam vadhulu kunnavu
nannu vadhulu koledhu naa  sarvama || 2 || || neelo ||

3.vevela dhoothalatho - kadaboora shabdhamutho o..
seeyonu raarajuvai naa korakey vasthaavu
naa dheena jeevitham - nee mahimatho nimpi
parishuddhula sahavasamulo cherchukundhuvey || 2 ||
                                                                                                                                     || neelo ||

పశువుల పాకలో మరియమ్మ గర్భాన - pashuvula paakalo mariyamma garbhaana

పల్లవి : పశువుల పాకలో మరియమ్మ గర్భాన
ప్రభు యేసు జన్మించే - ఓరన్నో యేసన్నా
పాపుల కొరకై వచ్చెనురో - ఓరన్నో  || 2 ||  ||  పశువుల ||
1.అయిదు రొట్టెలు రెండు చేపలు - అయిదువేల మందికి పంచెనురో || 2 ||
పాపుల కొరకై వచ్చెనురో - ఓరన్నో  యేసన్నా  || 2 ||  ||  పశువుల ||

2. కుంటోళ్లు గుడ్డోళ్లు - చెవిటోళ్లు మూగోళ్ళు  || 2 ||
స్వస్థతను యిచ్చెనురో -  ఓరన్నో  యేసన్నా  || 2 ||  ||  పశువుల ||

3.చచ్చినోల్లను లేపినాడు - గాలితుఫానును ఆపినాడు  || 2 ||
నీటిమీద నడిచెనురో - ఓరన్నో  యేసన్నా  || 2 ||  ||  పశువుల ||

lyrics in english
pallavi:
pashuvula paakalo mariyamma garbhaana
prabhu yesu janminche - oranno yesanna
paapula korakai vachenuro - oranno || 2 ||  || pashuvula ||

1.ayidhu rottelu rendu chepalu - ayidhu vela mandhiki panchenuro || 2 ||
paapula korakai vachenuro - oranno yesanna  || 2 ||                        ||pashuvula||

2.kuntollu guddollu - chevitollu moogollu || 2 ||
swasthathanu ichenuro - oranno yesanna || 2 || || pashuvula ||

3.chachinollanu lepinaadu - gaali thufaanunu aapinaadu || 2 ||
neetimeedha nadichenuro - oranno yesanna || 2 |||| pashuvula ||

నేను కూడా ఉన్నానయ్యా - నన్ను వాడుకో యేసయ్యా - nenu kooda unnaanayya - nannu vaaduko yesayya

 పల్లవి : నేను కూడా ఉన్నానయ్యా - నన్ను వాడుకో యేసయ్యా
పనికిరాని పాత్రననీ - పారవేయకు యేసయ్య (నను ) || నేను ||
1.విద్య లేని పామరులను - అపొస్థులుగా పంపించావయ్య
ఆ స్థానమున మేమున్నామయ్య
మమ్ము ఆత్మతో నింపి వాడుకొనుమయ్య  || నేను  ||
2.సిలువనెత్తుకొని నేను - నీ సాక్షిగానే సాగేదనయ్య
బ్రతుకుట యైతే నీ కోసమే - చావైనా ఎంతో లాభము || నేను ||
3.రాళ్లతో నన్ను కొట్టిన గాని - రక్తము కారిన మరువలేనయ్య
ఊపిరి నాలో ఉన్నంతవరకు నీ ప్రేమలోనే సాగెదనయ్య  || నేను || 

lyrics in english

pallavi:
nenu kooda unnaanayya - nannu vaaduko yesayya
panikiraani paathranani - paraveyaku yesayya (nanu)
|| nenu ||

1.vidhya leni paamarulanu - aposthaluga pampinchavayya
aa sthanamuna memunnamayya
mammu aathmatho nimpi vaadukonumayya  || nenu ||

2.siluva nethukoni nenu - nee sakshiga saagedhanayya
brathukuta yaithe nee kosame - chaavaina entho laabamu     || nenu ||

3.raallatho nannu kottina gaani - rakthamu kaarina maruvalenayya
oopiri naalo unnantha varaku  nee premaloney saagedhanayya || nenu ||

యెహోవా నాకు వెలుగాయె - యెహోవా నాకు రక్షణయే - yehova naaku velugaye - yehova naaku rakshanaye

పల్లవి :యెహోవా నాకు వెలుగాయె - యెహోవా నాకు రక్షణయే
నా ప్రాణ దుర్గమాయె - నేను ఎవరికీ ఎన్నడు భయపడను  || 2 ||
1.నాకు మార్గమును ఉపదేశమును - ఆలోచన అనుగ్రహించే
నేనెల్లప్పుడు ప్రభుసన్నిధిలో - స్తుతి గానము చేసెదను || 2 || || యెహోవా ||
2.నా కొండయు నా కోటయు - నా ఆశ్రయము నీవే
నేనెల్లప్పుడు ప్రభుసన్నిధిలో - స్తుతి గానము చేసెదను || 2 || || యెహోవా  ||
3.నా తల్లియు నా తండ్రియు - ఒకవేళలో మరచినను ఆపత్కాలమున
చేయి విడువకుండా యెహోవా నన్ను చేరదీయును || 2 || || యెహోవా ||

lyrics in english

pallavi:
yehova naaku velugaye - yehova naaku rakshanaye
naa praana dhurgamaaye - nenu evariki ennadu bayapadanu || 2 ||
1.naaku maargamunu upadheshamunu - alochana anugrahinche
nenellappudu prabhu sannidhilo - sthuthi gaanamu chesedhanu || 2 || || yehova ||
2.na kondayu na kotayu - naa ashrayamu neeve
nenellapudu prabhu sannidhilo - sthuthi gaanamu chesedhanu || 2 || || yehova ||
3.na thalliyu na thandriyu - okavelalo marachinanu apathkaalamuna
cheyi viduvakunda yehova nannu cheradheesenu || 2 ||
|| yehova ||

ఎవరులేక ఒంటరినై - అందరికి నే దూరమై అనాధగా మిగిలాను - evaru leka ontarinai - andhariki ne dhooramai anaadhaga migilaanu

 పల్లవి :ఎవరులేక ఒంటరినై - అందరికి నే దూరమై అనాధగా మిగిలాను
రావా యేసయ్య నువ్వు రావా యేసయ్య || 2 ||
1.నేనున్నాను ...నేనున్నానని -అందరూ అంటారు
కష్టాల్లో బాధల్లో - కదలిపోతారు || 2 ||
దీనుడనై అంధుడనై - అనాధగా నేను మిగిలాను || 2 || || రావా యేసయ్య ||

2.స్నేహితులని నమ్మాను మోసం చేసారు
బంధువులను నమ్మాను ద్రోహం చేసారు
దీనుడనై అంధుడనై - అనాధగా నేను మిగిలాను || 2 || || రావా యేసయ్య ||

3.చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలని
శాశ్వతమైన నీ ప్రేమ చిరకాలం నిలవాలని
దీనుడనై అంధుడనై  - అనాధగా నేను మిగిలాను || 2 || || రావా యేసయ్య ||

lyrics in english
pallavi:
evaru leka ontarinai - andhariki ne dhooramai anaadhaga migilaanu
raava yesayya nuvvu raava yesayya || 2 ||

1.nenunnanu ...nenunnanu - andharu antaaru
kashtallo badhallo - kadhalipotharu || 2 ||
dheenudanai andhudanai - anaadhaga nenu migilanu
|| 2 || || raava ||

2.snehithulanu nammanu mosam chesaru
bandhuvulani nammanu dhroham chesaru
dheenudanai andhudanai - anaadhaga nenu migilanu
|| 2 || || raava ||

3.chirakaalam nee prema kalakaalam undaalani
shaashwathamain nee prema chirakaalam nilavaalani
dheenudanai andhudanai - anaadhaga nenu migilanu || 2 || || raava ||

గుండె చెదరిన వారిని - ఆదరించు దేవుడ - gunde chedharina vaarini - aadharinchu dhevuda

పల్లవి:గుండె చెదరిన వారిని - ఆదరించు దేవుడ
గూడు చెదరిన పక్షుల చేరదీసె నాధుడ || 2 ||
త్యాగశీలుడా నీకు వందనాలయ్యా
నా హృదయ పాలక నీకు స్తోత్రమేసయ్య || 2 ||
1.లోకమను అరణ్య యాత్ర - భారమాయెను బహు దూరమాయెను
నీ గుండె నుండా వేదనలు - నిండియుండెను నిందించు చుండెను  || 2 ||
కన్నీరే నాకు అన్నపానమాయెను || 2 ||
దిక్కులేక నా బ్రతుకు దీనమాయెను బహు ఘోరమాయెను  || 2 ||  || గుండె చెదరిన ||
2.మనిషి మనిషి ఓర్వలేని మాయలోకము శూన్య ఛాయ లోకము
మాటలతో గాయపరచు క్రూరలోకము అంధకార లోకము
ఒంటరితనమే నాకు స్నేహమాయెను || 2 ||
దిక్కులేని నా బ్రతుకే దీనమాయెను బహు ఘోరమాయెను || 2 ||   || గుండె చెదరిన ||
3.కష్టాల కడలి అలలు నన్ను కమ్ముకున్నవి నన్ను అల్లుకున్నవి
కన్నీరు కెరటమై ఎదలో పొంగుచున్నది పొరలి సంద్రమైనది  || 2 ||
ప్రాణార్పణముగా నేను పోయబడితిని సిలువ సాక్షినైతిని  || 2 ||  || గుండె చెదరిన ||

lyrics in english

pallavi:
gunde chedharina vaarini - aadharinchu dhevuda
goodu chedharina pakshula cheradheesu naadhuda || 2 ||
thyaagasheeluda neeku vandhanaalayya
naa hrudhaya paalaka neeku sthothramesayya || 2 ||

1.lokamanu aranya yaathra - baaramayenu bahu dhooramayenu
naa gundenundaa vedhanalu - nindiyundenu nindhinchu chundenu || 2 ||
kannire naaku annapaanamayenu || 2 || || gunde ||

2.manishi manishi orvaleni maayalokamu shoonya chaaya lokamu
maatalatho gaayaparachu krooralokamu andhakaara lokamu
ontarithaname naaku snehamayenu || 2 ||
dhikkuleni naa brathukey dheenamayenu bahu ghoramayenu || 2 || || gunde ||

3.kashtaala kadali alalu nannu kammukunnavi nannu allukunnavi
kanneeru keratamai edhalo ponguchunnadhi porali sandhramainadhi  || 2 ||
shramala kolimilo putami veyabadithini || 2 ||
pranaarpanamuga nenu poyabadithini siluva sakshinaithini || 2 || || gunde ||

ఎవరున్నారు నాకు - ఇంకెవరున్నాయ్యా - evarunnaru naaku - inkevarunnarayya

పల్లవి :ఎవరున్నారు నాకు - ఇంకెవరున్నాయ్యా || 2 ||
నీవు తప్ప వేరెవ్వరూ - లేనేలేరయ్యా || 2 ||
నీవే యేసయ్యా నాకు - అన్నియు నీవయ్యా
నీవే యేసయ్యా - నా సర్వము నీవయ్యా   || ఎవరున్నారు ||
1.రక్తసంబంధము - నన్ను వేరు చేసినా
అంతరంగమందు - నన్ను చూచి నవ్వుకున్నా  || 2 ||
నాతో ఉన్న దేవుడవు - నీవే యేసయ్యా
నాలో వున్నా దేవుడవు - నీవే యేసయ్యా
నీవే యేసయ్య - నా ఇంటిలో నీవయ్యా
నీవే యేసయ్య - నీ ఒడిలో నేనయ్యా   || ఎవరున్నారు||
2.బంధు వర్గమంతా - నన్ను తక్కువ చేసిన
పేద బ్రతుకునందు - నన్ను చీదరించుకున్నా
నాతో ఉన్న దేవుడవు - నీవే యేసయ్యా
నాలో వున్నా దేవుడవు - నీవే యేసయ్యా
నీవే యేసయ్య - నా తండ్రివి నీవయ్యా
నీవే యేసయ్యా - నా దుర్గము నీవయ్యా || 2 ||          || ఎవరున్నారు||
3.చుట్టు ప్రక్కలంతా - నన్ను హేళన చేసిన
మాటలాడకుండా - వారు మూతి ముడుచుకున్న || 2 ||
నాతో ఉన్న దేవుడవు - నీవే యేసయ్యా
నాలో వున్నా దేవుడవు - నీవే యేసయ్యా
నీవే యేసయ్యా నా బంధువు నీవయ్యా
నీవే యేసయ్యా నా నేస్తము నీవయ్యా || 2 ||  || ఎవరున్నారు||

lyrics in english

pallavi:
evarunnaru naaku - inkevarunnarayya || 2 ||
neevu thappa verevvaru - lene lerayya || 2 ||
neeve yesayya naaku - anniyu neevayya
neeve yesayya - na sarvamu neevayya || evarunnaru ||

1.rakthasambandhamu nannu veru chesina
antharangamandhu nannu choosi navvukunna || 2 ||
naatho vunna dhevudavu - neeve yesayya
naalo unna dhevudavu - neeve yesayya
neeve yesayya - naa yintilo neevayya
neeve yesayya - na odilo neevayya || evarunnaru ||

2.bandhu vargamantha - nannu thakkuva chesina
pedha brathukunandhu - nannu cheedharinchukunna
naatho vunna dhevudavu - neeve yesayya
naalo unna dhevudavu - neeve yesayya
neeve yesayya - naa thandrivi neevayya
neeve yesayya - naa dhurgamu neevayya  || 2 ||
                                        || evarunnaru ||

3.chuttu prakkalantha - nannu helana chesina
maatalaadakunda - vaaru moothi muduchukunna || 2 ||
naatho vunna dhevudavu - neeve yesayya
naalo unna dhevudavu - neeve yesayya
neeve yesayya - naa bandhuvu neevayya
neeve yesayya - naa nesthamu neevayya || 2 ||
                                        || evarunnaru ||

రాజా నీ భవనములో రేయి పగలు - వేచియుందును యేసు రాజా - raaja nee bhavanamulo reyi pagalu vechiyundhunu yesu raaja

పల్లవి : రాజా నీ భవనములో రేయి పగలు - వేచియుందును యేసు రాజా
స్తుతించి ఆరాధింతును - నా చింతలు మరిచెదను || 2 ||

1.నా బలమా నా కోట ఆరాధనా - నీకే
నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా - నీకే
ఆరాధనా ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా || 2 || || రాజా ||

2.అంతట నివసించు యెహోవా ఎలోహిమ్  ఆరాధనా నీకే
నా యొక్క నీతి - యెహోవా సిద్కెను ఆరాధనా నీకే
ఆరాధనా ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా || 2 || || రాజా ||

3. పరిశుద్ధ పరచు - యెహోవా కాదెషు ఆరాధన నీకే
రూపించు దైవం యెహోవా హుషెను ఆరాధనా నీకే
ఆరాధనా ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా || 2 || || రాజా ||

lyrics in english

pallavi:

raaja nee bhavanamulo reyi pagalu vechiyundhunu yesu raaja
sthuthinchi araadhinthunu - naa chinthalanni marichedhanu || 2 ||

1.naa balamaa naa kota araadhana - neeke
naa dhurgama ashrayama araadhana neeke
araadhana araadhana abba thandri neekenayya || 2 ||
 || raja ||

2.anthata nivasinchu yehova elohim - araadhana neeke
naa yokka neethi - yehova sidhkenu araadhana neeke
araadhana araadhana abba thandri neekenayya || 2 ||
 || raja ||

3.parishuddha parachu - yehova kaadheshu araadhana neeke
roopinchu dhaivam yehova hushenu araadhana neeke
araadhana araadhana abba thandri neekenayya || 2 ||
 || raja ||



యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా - yesayya namamlo shakthi unnadhayya

పల్లవి : యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా
శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా
నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని || 2 ||
1.పాపాలను క్షమియించే శక్తి కలిగినది యేసయ్య నామం
పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం || 2 || || యేసయ్య ||

2. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం
మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం || 2 || || యేసయ్య ||

3.దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం
దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం || 2 || || యేసయ్య ||

4.సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం
మృతులను లెపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం || 2 || || యేసయ్య ||

lyrics in english

pallavi:
yesayya namamlo shakthi unnadhayya
shree yesayya namamlo shakthi unnadhayya
nammithey chalu neevu pondhukuntavu shakthini

1.papalanu tholaginche shakthi kaliginadhi yesayya namam
paapini pavithrapariche shakthi kaliginadhi yesayya namam  || 2 ||  || yesayya ||

2.rogiki swasthatha niche shakthi kaliginadhi yesayya namam
manasuku nemmadhiniche shakthi kaliginadhi yesayya namam  || 2 ||  || yesayya ||

3.dhuraathmalanu paaradhrole shakthi kaliginadhi yesayya namam
dhukkithulanu aadhrinche shakthi kaliginadhi yesayya namam  || 2 || || yesayya ||

4.srushtini shaasinchagaligina shakthi kaliginadhi yesayya namam
mruthulanu lepagaligina shakthi kaliginadhi yesayya namam  || 2 || || yesayya ||

నిత్యము స్తుతించినా నీ రుణము తీర్చలేను - nithyamu sthuthinchina nee runamu theerchalenu

 పల్లవి : నిత్యము స్తుతించినా నీ రుణము తీర్చలేను
సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను
రాజా ...రాజా ... రాజా... రాజాధిరాజువు నీవు
దేవా ....దేవా ...దేవా దేవాది దేవుడవు  || 2 ||
1.అద్వితీయ దేవుడా - ఆది అంతమునై యున్నవాడ
అంగలార్పును నాట్యముగా - మార్చివేసిన మహాప్రభు || 2 ||
                                             || రాజా ||
2.జీవమైన దేవుడా - జీవమిచ్చిన నాధుడా
జీవజలముల బుగ్గయొద్దకు - నన్ను నడిపిన కాపరి || 2 ||
                                               || రాజా ||
3. మార్పులేని దేవుడా - మాకు సరిపోయిన వాడా
మాటతోనే సృష్టినంతా - కలుగజేసిన పూజ్యుడా || 2 ||
                                           || రాజా || 
lyrics in english

pallavi:
nithyamu sthuthinchina nee runamu theerchalenu
samasthamu neekichina nee thyagamu maruvalenu
raja..raja...raja..rajaadhiraajuvu neevu
dheva...dheva...dheva dhevadhi dhevudavu || 2 ||

1.adhvitheeya dhevuda - aadhi anthamunai yunnavaada
angalaarpunu natyamuga - marchivesina mahaprabhu || 2 ||                        || raja ||

2.jeevamaina dhevuda jeevamichina naadhuda
jeevajalamula bugga yoddhaku - nannu nadipina kaapari || 2 ||            || raja ||

3.maarpuleni dhevuda - maaku saripoina vaada
maatathone srushti nantha - kalugajesina poojyuda
||2||                           || raja ||

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్య - neelo intha prema o yesayya

 పల్లవి :నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్య ఆ .. నాపై ఎంత జాలి ఓ యేసయ్య  || 2 || ఎందుకో నన్నింతగా ప్రేమించావు నేనెలాగు నీ రుణము తీర్చుకోనయ్య 1. పాపినైన...