కుమ్మరి చేతిలో మంటివలె -తల్లి వడిలో పసిబిడ్డవలె - kummari chethilo mantivaley - thalli vadilo pasi biddavaley

 
పల్లవి :కుమ్మరి చేతిలో మంటివలె -తల్లి వడిలో పసిబిడ్డవలె (2)
అయ్యా నీ కృపతో నన్ను మార్చుము
యేసయ్య నీ పోలికగా నన్ను దిద్దుము
                                  || కుమ్మరి చేతిలో ||
1.నాలోని స్వయమును నలుగగొట్టుము -
నాలోని వంకరలు చక్కగా చేయుము (2)
నీపోలిక వచ్చేవరకు నా చేయి విడువకు (2)
సారెపై నుండి తీసివేయకు(2)
                             || కుమ్మరి చేతిలో ||
2. నాలోని అహమును పారద్రోలుము-
నాలోని తొందరలు తీసివేయుము (2)
నీ భుజముపై ఆనుకొనే బిడ్డగా మార్చుము (
2)
నీ చేతితో నడిపించుము (2)
                             || కుమ్మరి చేతిలో ||

lyrics in english

pallavi:
kummari chethilo mantivaley - thalli vadilo pasibiddavale (2)
ayya nee krupatho nannu maarchumu
yesayya nee polikaga nannu dhiddhumu

1.naloni swayamunu nalugagottumu
naloni vankaralu chakkaga cheyumu (2)
nee polika vachevaraku naa cheyi viduvaku (2)
saareypai nundi theesiveyaku (2)

                             || kummari chethilo mantivaley ||

2.naloni ahamunu paaradhrolumu
naloni thondharalu thosiveyumu (2)
nee bhujamupai aanukoney biddaga maarchumu (2)
nee chethitho nadipinchumu (2)

                               || kummari chethilo mantivaley ||

దేవుని ప్రేమ ఇదిగో -జనులారా భావంబునం దెలియరే

 
పల్లవి :దేవుని ప్రేమ ఇదిగో -జనులారా భావంబునం దెలియరే
కేవలము నమ్ముకొనిన -పరలోక జీవంబు మన కబ్బును

1. సర్వలోకము మనలను -తన వాక్య సత్యంబుతో జేసెను
సర్వోపకారుడుండే -మనమీద జాలిపరుడై యుండెను  || దేవుని ||

2.మానవుల రక్షింపను -దేవుండు తన కుమారుని బంపెను
మన శరరీరము దాల్చెను -ఆ మ్రభువు మన పాపముకు  దూరుడే  || దేవుని ||

3. యేసు క్రీస్తను పేరున -రక్షకుడు వెలసినాడిల లోపల
దోసకారి జనులతోనెంతో -సుభాషలను బల్కినాడు || దేవుని ||

4. పాప బారంబు తోడ -నే ప్రొద్దు ప్రయాసముల బొందెడి
పాపులందరు నమ్మిన -విశ్రాంతి పరిపూర్ణమిత్తుననెను || దేవుని ||

5. సతులైన పురుషులైనన్  యాకర్త సర్వజనుల యెడలను
సత్ప్రేమగా నడిచెను -పరలోక సద్బోధలిక జేసెను || దేవుని ||

6.చావు నొందిన కొందరిన్ -యేసుండు చక్కగా బ్రతికించెను
సకల వ్యాధుల రోగులు -ప్రభునంటి స్వస్తంబు తమొందిరి || దేవుని ||

7.గాలి సంద్రపు పొంగులన్ -సద్దనపి నీళ్లపై నడచినాడే
మేలు గల యద్భుతము -ఈలాగు వేలకొలదిగా జేసెను || దేవుని ||

8. చేతుల కళ్ళలోనూ -రారాజు చేర మేకులు బొందెను
పాతకులు గొట్టినారే -పరిశుద్ధ నీతి తామోర్వలేకన్  || దేవుని ||

9.ఒడలు రక్తము గారగ -దెబ్బలు చెడుగు లందఱు గొట్టిరి
వడిముళ్ళు తల మీదను -బెట్టిరి ఓర్చేనో రక్షకుండు  || దేవుని ||

10.ఇన్ని బాధలు బెట్టుచు -దను జంపుచున్న పాప నరులను
మన్నించుమని తండ్రిని -యేసుండు సన్నుతితో వేడెను || దేవుని ||

11.రక్షకుడు శ్రమ బొందగా -దేశంబు తక్షణము చీకటయ్యెన్
రక్షకుడు మృతి నొందగ -తెర చినిగి రాతి కొండలు పగిలెను  || దేవుని ||

12. రాతి సమాధిలోను -రక్షకుని నీతి గల దేహంబును
పాతిపెట్టిరి భక్తులు -నమ్మిన నాథులందఱు జూడగ  || దేవుని ||

13. మూడవ దినమందున -యేసుండు మృతి గెల్చి లేచినాడు
నాడు నమ్మిన మనుజులు -చూచిరి నలువది దినములందున్ || దేవుని ||

14.పదునొకండు మారులు -వారలకు బ్రత్యక్షుడాయే నేసు
పరలోకమున కేగెను-తన వార్త బ్రకటించుమని పల్కెను  || దేవుని ||

15. నమ్మి బాప్తిస్మమొందు -నరులకు రక్షణ మరి కల్గును
నమ్మనొల్లక పోయెడు -నరులకు నరకంబు సిద్ధమాయెను || దేవుని ||

ఎగురుతున్నది విజయపతాకం - egututhunnadi vijayapathaakam


పల్లవి :ఎగురుతున్నది విజయపతాకం
యేసు రక్తమే మా జీవిత విజయం
రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును-
సుఖ జీవనం చేయుటకు శక్తి నిచ్చును (2)
రక్తమే...  రక్తమే..  రక్తమే..  యేసు రక్తమే
రక్తమే జయం యేసు రక్తమే జయం (2)

1.యేసుని నామం నుచ్చరింపగనే -
సాతాను సైన్యము వణకుచున్నది (2)
వ్యాధుల బలము నిర్మూలమైనది
జయం పొందెడి నామము నమ్మినప్పుడే (2)
రక్తమే...  రక్తమే..  రక్తమే..  యేసు రక్తమే
రక్తమే జయం యేసు రక్తమే జయం (2)

2.దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం -
ఎడతెగకుండగ మనము స్మరణ చేయుదం (2)
పాపపు క్రియలన్నిటిని చెదరగొట్టిన-
క్రీస్తుని సిలువను మనము అనుసరించుదం (2)
రక్తమే...  రక్తమే..  రక్తమే..  యేసు రక్తమే
రక్తమే జయం యేసు రక్తమే జయం (2)

3. మా ప్రేమా వైద్యుడా ప్రాణనాధుడ -
ప్రీతితోను నీ హస్తము చాటుము దేవా
(2)
 నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను -
స్వస్థరుచుము తండ్రి ఈ క్షణమందే (2)
                              || ఎగురుతున్నది ||

lyrics in english
pallavi:
eguruthunnadhi vijayapathakam
yesu rakthame ma jeevitha vijayam
roga dhukka vyasanamulanu theerchiveyunu
sukha jeevanam cheyutaku shakthi nichunu (2)
rakthame..rakthame...rakthame...yesu rakthame
rakthame jayam yesu rakthame jayam(2)

1.yesuni naamam nuchrinpagane
saathanu sainyamu vanakuchunnadhi (2)
vyaadhula balamu nirmoolamainadhi
jayam pondhedi naamamu namminappudey (2)
rakthame..rakthame...rakthame...yesu rakthame
rakthame jayam yesu rakthame jayam(2)

                                      || egututhunnadi vijayapathaakam ||

2.dhyyapu kaaryaalanu gelachina raktham
yedathegakundaga manamu smarana cheydham (2)
paapapu kriyalannitini chedharagottina
kreesthuni siluvanu manamu anusarinchudham (2)
rakthame..rakthame...rakthame...yesu rakthame
rakthame jayam yesu rakthame jayam(2)

                                    || egututhunnadi vijayapathaakam ||

3.ma prema vaidhyuda praananaadhuda
preethithonu nee hasthamu chaaatumu dheva (2)
nee paadha padhmupai cheriyunna prajalanu
swasthaparachumu thandri ee kshanamandhe (2)

                                  || egututhunnadi vijayapathaakam ||





కలవరపడి నే కొండల వైపు -నా కన్నులెత్తుదునా - kalavarapadi ne kondala vaipu - naa kannulethudhuna


పల్లవి : కలవరపడి నే కొండల వైపు -నా కన్నులెత్తుదునా
కొండలవైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలేదనా.. - కొదువతో నేను కుమిలేదన
                                       || కలవరపడి నే ||
1.నీవు నాకుండగా - నీవే నా అండగా (2)
నీవే నా .. నీవే నా.. నీవే నా ..
నీవే నా ఆత్మ దాహము తీర్చినా- వెంబడించిన బంధము 
                                          || కొండలవైపు  ||
2. సర్వకృపానిధివి సంపదల గణివి (2)
సకలము..  సకలము .. సకలము
సకలము చేయగల నీవైపే నా కన్నులెత్తి చూచెద 
                              || కొండలవైపు  ||
3. నిత్యము కదలని సీయోను కొండపై (2)
యేసయ్య .. యేసయ్య .. యేసయ్య
యేసయ్య .. నీదు ముఖము చూచుచు పరవశించి పాడెద
                                   || కొండలవైపు  ||

lyrics in english
pallavi:
kalavarapadi ne kondalavaipu - naa kannuletthudhunaa
kondalavaipu naa kannuletthi koduvatho nenu kumiledhana...-kodhuvatho nenu kumiledhana
                                 || kalavarapadi ne ||

1.neevu naakundaga - neeve naa andaga (2)
neeve na..neeve na...neeve na...
neeve na aathma daahamu theerchina - vembadinchina bandhamu
       
                                      || kondalavaipu ||

2.sarwakrupaa nidhivi sampadhala ghanivi (2)
sakalamu..sakalamu...sakalamu...
sakalamu cheyagala neevaipe naa kannuletthi choochedha

                                            || kondalavaipu ||

3.nithyamu kadhalani seeyonu kondapai (2)
yesayya... yesayya...yesayya
yesayya...needhu mukamu choochuchu paravasinchi paadedha
                       
                                           || kondalavaipu ||
                                       

తేనెకన్నా తీయనైనది నా యేసు ప్రేమ - thene kanna theeyanainadhi naa yesu prema

 

పల్లవి : తేనెకన్నా తీయనైనది నా యేసు ప్రేమ -
మల్లికన్నా తెల్లనైనది (2)
నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను -
కష్టకాలమందు నాకు తోడైఉండెను (2)
                                  || తేనెకన్నా తీయనైనది ||
1.ఆగక నే సాగిపోదును-నా ప్రభువు చూపించు బాటలో (2)
అడ్డంకులన్నీ నన్ను చుట్టినా -నా దేవుని నే విడువకుందును (2)
                               || తేనెకన్నా తీయనైనది ||
2. నా వాళ్ళే నన్ను విడిచిన -నా బంధువులే దూరమైన (2)
ఏ తోడు లేక ఒంటరినైనను -నా తోడు క్రీస్తని ఆనందింతును (2)
                            || తేనెకన్నా తీయనైనది ||
lyrics in english
pallavi:
theney kanna theeyanainadhi naa yesu prema
mallikanna thellaanainadhi (2)
nannu preminchenu nannu rakshinchenu
kashtakaalamandhu naaku thodai undenu(2)

                     || thene kanna theeyanainadhi naa yesu prema ||

1.aagake ne saagipodhunu - naa prabhuvu choopinchu baatalo (2)
addankulanni nannu chuttina - naa dhevuni ne viduvakundunu (2)

                  || thene kanna theeyanainadhi naa yesu prema ||

2.naa vaalle nannu vidachina - naa bandhuvuley dhooramaina (2)
e thodu lekha ontarinainanu - naa thodu kreesthani anandhinthunu (2)

             || thene kanna theeyanainadhi naa yesu prema ||

నా పట్ల నీ ప్రాణాలికేంటయ్యా - naa patla nee pranalikentayya


పల్లవి : నా పట్ల నీ ప్రాణాలికేంటయ్యా నువ్వు పిలిచినా ఉద్దేశం ఏంటయ్యా (2)
నెరవేర్చు నెరవేర్చేసయ్య ఆ... (4)
                           || నా పట్ల నీ ప్రాణాలికేంటయ్యా ||
1. కలవరపడుతున్న కన్నీరు కారుస్తున్న -
అధైర్యపడుతున్న అలసిపోతున్న (2)
నెరవేర్చు నెరవేర్చేసయ్య ఆ... (4)
                        || నా పట్ల నీ ప్రాణాలికేంటయ్యా ||
2. హింసకుడైన సౌలును పిలిచావే -
పౌలుగా మార్చి వాడుకున్నవే (2)
 నెరవేర్చు నెరవేర్చేసయ్య ఆ... (4)
                        || నా పట్ల నీ ప్రాణాలికేంటయ్యా ||
3.అమ్మబడినా యోసేపును పిలిచావె -
ఐగుప్తంతటికి రాజుగా చేసావే (2)
నెరవేర్చు నెరవేర్చేసయ్య ఆ... (4)
                        || నా పట్ల నీ ప్రాణాలికేంటయ్యా ||

lyrics in english
pallavi:
naa patla nee  pranalikentayya
nuvvu pilachina uddhesham entayya (2)
neraverchu neraverchesayya aa..(4)

                   || naa patla nee  pranalikentayya ||

1.kalavarapaduthunna kanneeru kaarusthunna-
adhairyapaduthunna alasipothunna (2)
neraverchu neraverchesayya aa..(4)

             || naa patla nee  pranalikentayya ||

2.himsakudaina soulunu pilichave-
pouluga maarchi vaadukunnave (2)
neraverchu neraverchesayya aa..(4)

          || naa patla nee  pranalikentayya ||

3.ammabadinaa yosepunu pilichave
igupthuthanthatiki raajuga chesave (2)
neraverchu neraverchesayya aa..(4)

           || naa patla nee  pranalikentayya ||





బ్రతుకుట నీ కోసమే - brathukuta nee kosame


పల్లవి :బ్రతుకుట నీ కోసమే -మరణమైతే నాకిక మేలు (2)
సిలువ వేయ బాడినానయ్య (2)
నీవే నాలో జీవించుమయ్య (2)
యేసయ్య...  యేసయ్య..  యేసయ్య .. నా యేసయ్య (2)

1.ఏ క్షణమైనా ఏ దినమైన-నీ కొరకే నే జీవించెద (2)
శ్రమలైన శోధనలైనా -ఇరుకులైన ఇబ్బందులైన (2)
ఊపిరి ఉన్నంత వరకు నీ సేవలో సాగెదనయ్య(2)
సేవలో సాగెదనయ్య ...  
యేసయ్య...  యేసయ్య..  యేసయ్య .. నా యేసయ్య (2)
                                                    || బ్రతుకుట నీ కోసమే ||

2.లోకములోన నిందలు నాపై రాళ్ళై రువ్విన రంపాలై కోసిన (2)
రాజులైన అధిపతులైన ఉన్నవి ఐన రాబోవునవైనా (2)
నీదు ప్రేమ నుండి ఏవి ఎడబాపవయ్యా (2)
ఏవి ఎడబాపవయ్యా ..
యేసయ్య...  యేసయ్య..  యేసయ్య .. నా యేసయ్య (2)
                                                   || బ్రతుకుట నీ కోసమే ||
lyrics in english
pallavi:
brathukuta nee kosame - maranamaithe naakika melu (2)
siluva veya badinaanayya (2)
neeve naalo jeevinchumayya (2)
yesayya..yesayya...yesayya...na yesayya (2)

1.ey kshanamaina ey dhinamaina - nee korake ne jeevinchedha (2)
shramalaina shodhanalaina -irukulaina ibbandhulaina (2)
oopiri unnantha varaku nee sevalo saagedhanayya (2)
sevalo saagedhanayya...
yesayya..yesayya...yesayya....naa yesayya (2)

                        || brathukuta nee kosame ||

2.lokamulona nindhalu naapai raallai ruvvina rampaalai kosina (2)
 raajulaina adhipathulaina unnavi aina raabovunavaina (2)
needhu prema nundi evi edabaapavayya (2)
evi edabaapavayya....
yesayya..yesayya...yesayya....naa yesayya (2)

                    || brathukuta nee kosame ||


సర్వసృష్టిలోని జీవరాశిఅంత - sarva shrushti loni jeevaraashi antha

 
పల్లవి :సర్వసృష్టిలోని జీవరాశిఅంత -నీదు మహిమనే ప్రస్తుతించగా
స్వరమెత్తి నీ మహిమ కార్యములను -ప్రతి స్థలమునందు ప్రకటించెద
నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం
నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువవు ఎడబాయవు నా యేసయ్య
                                                                   || సర్వసృష్టిలోని ||
1. ఇ పర్వత శికరాకాశం నీ అద్భుతకార్యములే
 ఇ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే   
నీవు లేనిదే ఏమి కలుగలేదు -ఆది సంభూతుడా
నీవు ఉండగా నాకు భయము లేదు పరమ జయశాలి
నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం
నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువవు ఎడబాయవు నా యేసయ్య
                                                                   || సర్వసృష్టిలోని ||
2.నీ రూపములో నను చేసిన పరమ కుమ్మరి
నీ రక్తము నిచ్చి కొన్న జాలి హృదయమా
నీవు లేనిదే ఏమి కలుగలేదు -ఆది సంభూతుడా
నీవు ఉండగా నాకు భయము లేదు పరమ జయశాలి
నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం
నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువవు ఎడబాయవు నా యేసయ్య
                                                                   || సర్వసృష్టిలోని ||

lyrics in english
pallavi:
sarva srushti loni jeevaraashi antha - needhu mahimane prasthuthinchaga
swaramethi paadi nee mahima kaaryamulanu - prathi sthalamunandhu prakatinchedha
neeve maargam neeve sathyam neeve jeevam
ninna nedu repu okatiga unnavaadavu viduvavu edabaayavu na yesayya
 
                                      || sarva shrushti loni ||

1.ee parvatha shikaraakasham nee adhbuthakaaryamuley
ee pachika boomi nadhulu nee chethi panuley
neevu lenidhe emi kalugaledhu - aadhi samboothuda
neevu undaga naaku bhayamu ledhu parama jayashaali
neeve maargam neeve sathyam neeve jeevam
ninna nedu repu okatiga unnavaadavu viduvavu edabaayavu na yesayya

                                      || sarva shrushti loni ||

2.nee roopamulo nanu chesina parama kummari
nee rakthamu nichi konna jaali hrudayama
neevu lenidhe emi kalugaledhu - aadhi samboothuda
neevu undaga naaku bhayamu ledhu parama jayashaali
neeve maargam neeve sathyam neeve jeevam
ninna nedu repu okatiga unnavaadavu viduvavu edabaayavu na yesayya
 
                                    || sarva shrushti loni ||



నీవు లేని చోటేది యేసయ్య - neevu leni chotedhi yesayya


 పల్లవి :నీవు లేని చోటేది యేసయ్య -నే దాగి క్షణముండలేనయ్య  
నీవు చూడని స్థలమేది యేసయ్య -కనుమరుగై నేనుండలేనయ్య (2)
నీవు వినని మనవేది యేసయ్య -నీవు తీర్చని బాధ ఏది యేసయ్య (2)
నీవుంటే నావెంట అదియే చాలయ్య (4)
                                     || నీవు లేని చోటేది యేసయ్య||
1. కయ్యుని క్రూర పగకు - బలియైన ఏబెలు
రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు
అన్నల ఉమ్మడి కుట్రకు -గురియైన యోసేపు
మరణగొష గోతి నుండి విన్న దేవుడవు
చెవియొగ్గి నా మొరను యేసయ్య నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్య (2)
నీవుంటే నావెంట అదియే చాలయ్య (4)
                                     || నీవు లేని చోటేది యేసయ్య||
2. సౌలు ఈట దాటికి గురిఅయిన దావీదు
ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు
సైతాను పొందిన కీడుకు -మొత్తబడిన యోబును
గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు  (2)
నీ తోడు నీ నీడ యేసయ్య నాకు లేకుంటే -నే జీవించలేనయ్య (2)
నీవుంటే నావెంట అదియే చాలయ్య (4)
                                     || నీవు లేని చోటేది యేసయ్య||

lyrics in english
pallavi:
neevu leni chotedhi yesayya - ney dhaagi kshanamundalenayya
neevu choodani sthalamedhi yesayya - kanumarugai nenundalenayya (2)
neevu vinani manvedhi yesayya - neevu theerchani baadha edhi yesayya (2)
neevunte naa venta adhye chaalayya (4)

                              || neevu leni chotedhi yesayya ||

1.kayyuni kroora pagaku - baliyaina yebelu
rakthamu pettina keka vinna dhevudavu
annala ummadi kutraku - guriyaina yosepu
maranagosha gothi nundi vinna dhevudavu
cheviyoggi naa moranu yesayya neevu vinakunte ne brathukalenayya (2)
neevunte naaventa adhiye chaalayya  (4)

                             || neevu leni chotedhi yesayya ||

2.soulu eeta dhaatiki guriyaina dhaavidhu
praanamu kaapadi rakshinchina dhevudavu
saithanu pondhina keeduku - mothabadina yobunu
gelipinchi dheevenalu kurupinchina dhevudavu (2)
nee thodu nee needa yesayya naaku lekunte - ne jeevinchalenayya (2)
neevunte naaventa adhiye chaalayya (4)

                        || neevu leni chotedhi yesayya ||

ఒక్కమాట చాలునయ్య నా యేసయ్య - okka maata chaalunayya na yesayya

 పల్లవి :ఒక్కమాట చాలునయ్య నా యేసయ్య నీ ఒక్కమాట చాలునయ్య నా యేసయ్య (2)
నీ మాటకేంతో శక్తి ఉందయ్యా నీవు మాట పలికితే  మహిమలు జరుగునయా (2)
యేసయ్య..  యేసయ్య..  యేసయ్య ... యేసయ్య(2)
                                                      || ఒక్కమాట చాలునయ్య ||
1. ఒక్క మాటతో లాజరును లేపావు -ఒక్క మాటతో దాసుని స్వస్థ పరిచావు (2)
ఒక్క మాటతో దయ్యములను తరిమేసావు (2)
ఒక్క మాటతో సౌలును పౌలుగ మార్చావు (2)
నీ మాటకేంతో శక్తి ఉందయ్యా నీవు మాట పలికితే  మహిమలు జరుగునయా (2)
యేసయ్య..  యేసయ్య..  యేసయ్య ... యేసయ్య(2)
                                                      || ఒక్కమాట చాలునయ్య ||
2. ఒక్క మాటతో పెను తుఫానును ఆపావు-ఒక్క మాటతో పాపములు క్షమియించావు (2)
ఒక్క మాటతో బాలికను బ్రతికించావు (2)
ఒక్క మాటతో సమరయ స్త్రీని మార్చావు (2)
నీ మాటకేంతో శక్తి ఉందయ్యా నీవు మాట పలికితే  మహిమలు జరుగునయా (2)
యేసయ్య..  యేసయ్య..  యేసయ్య ... యేసయ్య(2)
                                                      || ఒక్కమాట చాలునయ్య ||


lyrics in english
pallavi:
okka maata chaalunayya naa yesayya nee okka maata chaalunayya naa yesayya (2)
nee maatakentho shakthi undhayya neevu maata palikina mahimanu jaruganaya(2)
yesayya....yesayya....yesayya.....yesayya......(2)

                                            || okka maata chaalunayya ||

1.okka maatatho laajarunu lepavu - okka maatatho dhaasuni swastha parichavu
okka maatatho dhayyamulanu tharimesavu (2)
okka maatatho soulunu pouluga maarchavu (2)
nee maatakentho shakthi undhayya neeve maata palikithey mahimalu jarugunaya (2)
yesayya....yesayya....yesayya.....yesayya......(2)
 
                                              || okka maata chaalunayya ||

2.okka maatatho penu thufaanunu aapavu - okka maatatho papamulanu kshamiyinchaavu (2)
okka maatatho baalikanu brathikinchavu (2)
okka maatatho samaraya sreeni maarchavu (2)
nee maatakentho shakthi undhayya neevu maata palikithey mahimalu jarugunaya (2)
yesayya....yesayya....yesayya.....yesayya......(2)

                                            || okka maata chaalunayya ||


ఈ బ్లాగును సెర్చ్ చేయండి

నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్య - neelo intha prema o yesayya

 పల్లవి :నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్య ఆ .. నాపై ఎంత జాలి ఓ యేసయ్య  || 2 || ఎందుకో నన్నింతగా ప్రేమించావు నేనెలాగు నీ రుణము తీర్చుకోనయ్య 1. పాపినైన...