పల్లవి :దేవుని ప్రేమ ఇదిగో -జనులారా భావంబునం దెలియరే
కేవలము నమ్ముకొనిన -పరలోక జీవంబు మన కబ్బును
సర్వోపకారుడుండే -మనమీద జాలిపరుడై యుండెను || దేవుని ||
2.మానవుల రక్షింపను -దేవుండు తన కుమారుని బంపెను
మన శరరీరము దాల్చెను -ఆ మ్రభువు మన పాపముకు దూరుడే || దేవుని ||
దోసకారి జనులతోనెంతో -సుభాషలను బల్కినాడు || దేవుని ||
పాపులందరు నమ్మిన -విశ్రాంతి పరిపూర్ణమిత్తుననెను || దేవుని ||
సత్ప్రేమగా నడిచెను -పరలోక సద్బోధలిక జేసెను || దేవుని ||
సకల వ్యాధుల రోగులు -ప్రభునంటి స్వస్తంబు తమొందిరి || దేవుని ||
మేలు గల యద్భుతము -ఈలాగు వేలకొలదిగా జేసెను || దేవుని ||
పాతకులు గొట్టినారే -పరిశుద్ధ నీతి తామోర్వలేకన్ || దేవుని ||
వడిముళ్ళు తల మీదను -బెట్టిరి ఓర్చేనో రక్షకుండు || దేవుని ||
మన్నించుమని తండ్రిని -యేసుండు సన్నుతితో వేడెను || దేవుని ||
రక్షకుడు మృతి నొందగ -తెర చినిగి రాతి కొండలు పగిలెను || దేవుని ||
పాతిపెట్టిరి భక్తులు -నమ్మిన నాథులందఱు జూడగ || దేవుని ||
నాడు నమ్మిన మనుజులు -చూచిరి నలువది దినములందున్ || దేవుని ||
పరలోకమున కేగెను-తన వార్త బ్రకటించుమని పల్కెను || దేవుని ||
నమ్మనొల్లక పోయెడు -నరులకు నరకంబు సిద్ధమాయెను || దేవుని ||