చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం - chemmagillu kallalona kannilentha kaalam

పల్లవి:
చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం
 కష్టాల బాటలోనె సాగదు పయనం
విడుదల సమీపించెను
 నీకు వెలుగు ఉదయించును


1 నీవు మోసిన నిందకు ప్రతిగా - పూదండ ప్రభువు యిచ్చునులె
నీవు పొందిన వేదనలన్ని - త్వరలో తీరిపోవునులె
 నీ స్థితి చూసి నవ్వినవారే - సిగ్గుపడే దినమొచ్చేనులే
 విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును  
                                                                                                     ║చెమ్మగిల్లు║ 
 
 2. అనుభవించిన లేమి బాధలు - ఇకపై నీకు వుండవులే
అక్కరలోన ఉన్నవారికి - నీవే మేలు చేసే వులే
 మొదట నీ స్థితి కోంచమె ఉన్న - తుదకు వృద్ధిని పొందునులే
 విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును
                                                    ║చెమ్మగిల్లు║  
pallavi:
chemmagillu kallalona kannilentha kaalam
kashtaala baataloney saagadhu payanam
vidudhala samipinchenu
neeku velugu udhayinchunu

1.neevu mosina nindhaku prathiga - poodhanda prabhuvu ichunule
neevu pondhina vedhanalanni - thwaralo theeripovunule
nee sthithi choosi navvinavaare - siggupade dhinamochenule
vidudhala samipinchenu neeku velugu udhayinchunu
                                                                    || chemmagillu kallalona ||
2.anubavinchina lemi baadhalu - ikapai neeku undavule
akkaralona unnavaariki - neeve melu chesevule
modhata nee sthithi koncheme unna - thudhaku vruddhini pondhenule
vidudhala samipinchenu neeku velugu udhayinchunu
                                                                 || chemmagillu kallalona ||


ఈ బ్లాగును సెర్చ్ చేయండి

నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్య - neelo intha prema o yesayya

 పల్లవి :నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్య ఆ .. నాపై ఎంత జాలి ఓ యేసయ్య  || 2 || ఎందుకో నన్నింతగా ప్రేమించావు నేనెలాగు నీ రుణము తీర్చుకోనయ్య 1. పాపినైన...