పల్లవి :తల్లిలా లాలించును -తండ్రిలా ప్రేమించును (2)
ముదిమివచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును చంకపెట్టుకొని కాపాడును ..యేసయ్య
|| తల్లిలా లాలించును ||
1.తల్లియైన మరచునేమో నేను నిన్ను మరువను -
చూడుమా నా అరచేతులతో - నిన్ను చెక్కియున్నాను (2)
నీ పాదము త్రొట్రిళ్లనియ్యను నేను -నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు
అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్య
|| తల్లిలా లాలించును ||
2. పర్వతాలు తొలగవచ్చు -దద్దరిల్లు మెట్టలన్నీ -
వీడిపోదు నాకృప నీకు - నా నిబంధన తొలగదు (2)
దిగులు పడకు బయపడకు నిన్ను విమోచించెద
నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెద
అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్య
|| తల్లిలా లాలించును ||
lyrics in english
pallavi:
thallila laalinchunu - thandrila preminchunu (2)
mudhimi vachu varaku etthukoni mudhaadunu
chanka pettukoni kaapadunu ...yesayya
1.thalliyaina marachunemo nenu ninnu maruvanu -
choodumu naa arachethulalo - ninnu chekkiyunnaanu (2)
nee paadhamu throtrillaniyyanu nenu - ninnu kaapaduvaadu kunukadu nidhurapodu
ani cheppi vaagdhaanamu chesina yesayya
|| thallila laalinchunu ||
2.parvathaalu tholagavachu - dhaddharillu mettalanni
veedipodhu naa krupa neeku - naa nibandhana tholagadhu (2)
dhigulu padaku bayapadaku ninnu vimochinchedha
needhu baaramantha mosi naadhu shanthi nosagedha
ani cheppi vaagdhaanamu chesina yesayya.
|| thallila laalinchunu ||